![]() |
![]() |

బుల్లితెరపై మొదట చిన్న పాత్రల్లో నటించి, 'కృష్ణవేణి' లాంటి సీరియల్‌లో హీరోగా రాణించిన ఇస్మార్ట్ సయ్యద్ సొహేల్ బిగ్‌బాస్ తరువాత కథ వేరేగానే వుంది. సీజన్ 4లో టాప్ 5లో నిలిచిని సోహైల్ తనదైన మేనరిజమ్స్‌తో... ఆకట్టుకునే డైలాగ్‌లతో ప్రత్యేకతను చాటుకున్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి దృష్టిలోపడిన సొహేల్ చిరు నుంచి బంపర్ ఆఫర్‌తో పాటు ఆయన భార్య స్వయంగా చేసిన బిర్యానీని కూడా దక్కించుకుని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
తను చేసే సినిమాలో చిన్న గెస్ట్ పాత్ర అయినా తాను చేస్తానని మెగాస్టార్ చిరంజీవి.. ఇస్మార్ట్ సొహేల్‌కు బిగ్‌బాస్ ఫైనల్ స్టేజ్ సాక్షిగా మాటివ్వడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతకు ముందు సింగరేణి ముద్దు బిడ్డ అంటూ షోలో హల్‌చల్ చేసిన సొహేల్ టాప్ 3కి వచ్చేసరికి తెలివిగా ప్రవర్తించి 25 లక్షల క్యాష్‌తో ఇంటిదారి పట్టడం పలువురిని ఆకట్టుకుంది.
బిగ్‌బాస్ హౌస్‌లోనే కాదు, హౌస్ నుంచి బయటికి వచ్చాక కూడా సొహేల్ కథ వేరేగానే వుంది. హీరోగా ఓ సినిమాని ప్రకటించిన సోహైల్ తాజాగా ఎంజీ హెక్టర్ కారుని సొంతం చేసుకున్నాడు. తండ్రి, తమ్ముడితో కలిసి షోరూమ్‌కి వెళ్లిన సొహేల్ ఎంజీ హెక్టర్ కారుని కొనుగోలు చేశాడు. దీని విలువ దాదాపు రూ. 30 లక్షలు అని తెలిసింది. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు సొహేల్.
"ఫైనల్లీ.. కొత్త కారు కొనాలనే ఒక కల నిజమైంది. దీన్ని సాధ్యం చేసిన బిగ్ బాస్‌కు, ఎప్పుడూ నాకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన మా నాన్నకు థాంక్స్. హలో ఎంజీ." అని వాటికి క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
(1).jpg)
![]() |
![]() |